పాలనలో వై.సి.పి పూర్తిగా వైఫల్యం చెందింది: సంగిసెట్టి అశోక్

  • సంగిసెట్టి అశోక్ నేత్రుత్వంలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా, ముత్తా శశిథర్ సూచనలతో, పార్టీ అధ్యక్షులు సంగిసెట్టి అశోక్ నేత్రుత్వంలో గురువారం సాయంత్రం 38ఏ వ వార్డు సచివాలయం పరిధిలో ముమ్మిడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధి ప్రాంత ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు రేషన్ కార్డుల సరుకులు సమయానికి అందట్లేదని కొంతమంది, రేషన్ కార్డులు తమకు లేవని దీనితో కొన్ని ప్రభుత్వ పధకాలను తాము పొందలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా తమకి కొమరిగిరిలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ విషయమై సంగిసెట్టి అశోక్ స్పందిస్తూ తమ నాయకుడు ముత్తా శశిధర్ గారు కొమరిగిరి ప్రాంతాన్ని పరిశీలనకు వెళ్ళారనీ అక్కడ కనీస సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడం లేదని ఆందోళన చేసారని వారికి గుర్తుచేసారు. పేదల సంక్షేమం వదిలేసి, కుటిల రాజకీయాలు చేయడమే ఈ వై.సి.పి పార్టీకి వచ్చని, పాలనలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తక్షణమే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని జనసేన పార్టీ తరపున డిమండ్ చేస్తున్నామని తెలిపారు. ఇవేకాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరి సమస్యలపై జనసేన పార్టీ తరపున ముత్తా శశిధర్ గారి నాయకత్వంలో పోరాడతామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్ష్యుడు సంగిసెట్టి అశోక్, సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, వీరమహిళలు భవానీ, సత్యవేణి, రాఘవ, రాణి, అనంతలక్ష్మి, మంగాయమ్మ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.