హర్షవర్థిత మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ను ప్రారంభించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం, నెహ్రూ బజార్ పాండురంగస్వామి గుడి వద్ద హర్షవర్థిత మల్టీ & సూపర్ స్పెషాలిటీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ విచ్చేసి, హాస్పిటల్ ను ప్రారంభించారు.