ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 35వ రోజు పాదయాత్ర..

  • 18 డివిజన్లో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట..
  • ప్రజా సమస్యలు విస్మరించి డప్పులు, వాయిద్యాలకు పరిమితమైన వైసిపి నాయకులు – జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆరోపణ..

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 35 వ రోజు పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం స్థానిక 18వ డివిజన్ వంగాయగూడెం లోని అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి జనసేన పోరుబాట కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని పొణంగి పంట కాలువ కూడుకుపోయి వ్యవసాయదారులకు నీరందని పరిస్థితి ఏర్పడిందని, రైతాంగం ఆరోపించారు. కెనాల్ నుండి వంగాయ గూడెం, పంట కాలువ మునిగిపోయిందని, డివిజన్ పరిధిలో త్రాగునీరు అందక, ప్రజలు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై రెడ్డి అప్పలనాయుడు స్పందిస్తూ గత 20 సంవత్సరాలుగా ఏలూరు నగరాన్ని పరిపాలిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల నాని కానీ, నగర మేయర్, కార్పొరేటర్ కూడా డివిజన్ సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసారని రెడ్డి అప్పల నాయుడు ఆరోపించారు. తక్షణం డివిజన్ లోని ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని ఆయన పాలకులను హెచ్చరించారు. ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్, నగర ఉపాధ్యక్షులు సుందర నీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మహిళా 1టౌన్ అధ్యక్షురాలు కె. సుజాత, మహిళా సంయుక్త కార్యదర్శి ప్రమీల రాణి, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు,ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణ రావు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, వీరంకి పండు, గెడ్డం చైతన్య డివిజన్ నాయకులు భూపతి ప్రసాద్, పెంటయ్య, లహర్, సురేంద్ర, సన్యాసిరావు, క్రాంతి, కర్ర పవన్ కుమార్, పల్లి విజయ్, భూపతి ప్రసాద్, దాసరి బాబి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.