కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులుగా రమేష్ నియామకం

అమలాపురం రూరల్ మండల కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా కొంకాపల్లి గ్రామానికి చెందిన కానిపూడి రమేష్ ను నియమించినట్టు కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతు విభాగ అద్యక్షులు బసవ చినబాబు పేర్కొన్నారు. సోమవారం రమేష్ కు నియామక పత్రాలు అందజేసిన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా కాపు సంక్షేమ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.