ఎమ్మెల్యే అదీప్ రాజ్ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్..

  • కుటుంబ సభ్యులను మూడు మండలాలకు షాడో ఎమ్మెల్యేగా కేటాయించి అభివృద్ధిని మరిచి అవినీతితో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నవని అభివర్ణించిన వబ్బిన జనార్ధన శ్రీకాంత్

పెందుర్తి నియోజకవర్గం, 95 వార్డు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఇటీవల కాలంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ జనసేన పార్టీ అధ్యక్షులుపై, నాయకులపై చేసిన విమర్శలను నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .. రంగులు మార్చే పార్టీ జనసేన కాదని నీవు కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గా ఈనాడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నవని రేపు ఏ రంగులు పార్టీ లో ఉంటావో తెలియదు ఆని, స్థానికుడిగా నువ్వు ఉంటూ ఈ నియోజకవర్గ ఏమి అభివృద్ధి చేశావని, పెట్టవానిపాలెం, తాడి గ్రామ సమస్యలు ఇప్పటికీ అదేవిధంగా ఉన్నాయి, సబ్బవరం మండలాన్ని ఎడ్యుకేషనల్ గా హబ్ చేస్తావని మాటిచ్చారు, పెందుర్తి మండలంలో ఉన్న పంచ గ్రామాల సమస్య కోసం ఏమి చేసావ్, ఎమ్మెల్యే కాకముందు చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నేను తీరుస్తాను అని మాట ఇచ్చి ఈనాడు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజా కోసం ఆలోచించడం లేదని, కనీసం ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గంలో రోడ్లు కూడా బాగు చేయలేని దుస్థితిలో ఉన్నావు, స్థానికుడై ఉండి మీ గ్రామమైన రామపురం నుండి అక్కిరెడ్డిపాలెం వరకు వచ్చిన రహదారి దుస్థితి చూడమని నీకు ఆ రోడ్డు కనిపించడం లేదా స్థానికుడివే కదా, అభివృద్ధి చేయడానికి స్థానికుడే అయి ఉండవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేయవచ్చు ఆ విషయం నీకు తెలియదా, కార్పొరేషన్ ఎలక్షన్ లో ప్రజలు నీ అభివృద్ధిని చూసి కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ తో నీకు సన్మానం చేయడం జరిగిందని, జగన్ రెడ్డి గారు కూడా మీ యొక్క విజయానికి సన్మానం కూడా చేశారని, గ్రామస్థాయిలో నేను సర్పంచులు ఎంపీటీసీలు గెలిపించాను అని విర్రవీగిపోవాల్సిన అవసరం లేదు గ్రామాల్లో కూడా నీ మీద వ్యతిరేకత మొదలైందని, మీకు సోషల్ మీడియాలో పనిచేసిన పేటీఎం బ్యాచ్ ని అడిగిన ఆ విషయం తెలుస్తదని, మీ వెనకాల తిరిగిన బ్యాచ్చే నీకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిపోతారని అధిష్టానం కి చెప్తున్న విషయం సత్యం అని, రేపు నీకు పెందుర్తిలో ఎమ్మెల్యే సీటు వైఎస్ఆర్సిపి ఇవ్వటం లేదని తెలిసి ఈనాడు నీవు ఆధిపత్యం కోసం జనసేన పార్టీ పై నాయకులు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని, కాపు కళ్యాణ మండపంలో మంత్రివర్యులు విచ్చేసి కుల నాయకులు మధ్య, కులాలను మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం వ్యతిరేకించకుండా, కనీసం కార్యక్రమం చేసుకోవడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఏ విధంగా ప్రారంభిస్తారు అని జనసేన పార్టీ ఈ రోజు అడిగితే మీరు దానికి సమాధానం చెప్పకుండా ఆ యొక్క సమస్యలను తీరుస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వకుండా ఈరోజు నీ ప్రవర్తన చూస్తే ఇలాంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నాం అని చెప్పి నీ వెనకాల తిరుగుతున్న కాపు నాయకులతో పాటు మిగిలిన కులం సంబంధించిన నాయకులు కూడా ముక్కుని వేలు వేసుకున్నారని, పెందుర్తిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలు బలంగా నమ్ముతున్నారని తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటామని, నీవు ఎమ్మెల్యే అవ్వడం వల్ల నీవు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందావ్ తప్ప పెందుర్తి లో ఉన్న ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని, నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మధ్య జనసేన పార్టీతో చర్చకి సిద్ధమా, టైం డేటు నీవే నిర్ణయించు మేమందరం వచ్చి మీ యొక్క అభివృద్ధిని ప్రజల మధ్యలో ఎండగడతామని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు కంచిపాటి మధు, పెన్నంటి పార్వతి, సాలాపు కనకరాజు, మామిడి శంకర్రావు, జూత్తద శ్రీనివాస్, తనకాల శ్రీనివాస్, మెండా సతీష్, వైకుంఠ రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.