ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 39వ రోజు పాదయాత్ర..

ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా శుక్రవారం 18వ డివిజన్లో లక్ష్మమ్మ చెరువు గట్టు వద్ద నుండి రెడ్డి అప్పలనాయుడు పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవోవో కుంటి సాకులు చెప్పి సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని, స్థానికంగా ఉండే ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమిటంటే మంచినీటి కొరత తీవ్రత ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మేయర్, శాసనసభ్యులు ఇప్పటికైనా ఆ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ డివిజన్ లోని ఒక ఆవిడ తన భర్త చనిపోతే తలదాచుకోడానికి తన తల్లి తండ్రుల వద్ద ఉంటే వారి పెన్షన్లు పీకివేశారు. ఆ పక్కనే ఉన్న మూగ చెవిటి వారి పెన్షన్లు సైతం పీకేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు తొలగించారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తూ ప్రజలు నడ్డిని విరగొడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వం, పెన్షన్లు తీసి వేసే ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయో అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. మంచినీటి సమస్య అనేది ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా స్థానిక మేయర్ గారు గాని, మున్సిపల్ అధికారులు కానీ, ఆళ్ల నాని గాని తను ఈ సమస్యలను పరిష్కారం చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని అది మీ బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అది కూడా మీరు నెరవేర్చనప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజెస్తుమన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, గొడవర్తి నవీన్, కోశాధికారి పైడి లక్ష్మణరావు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్తిరి శివ, కోలా శివ నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, కాకర్ల శ్రీను, ప్రసాద్, బాబు స్థానిక నాయకులు బి.సన్యాసిరావు, ఎమ్.దుర్గారావు, శ్రావణి, పల్లి విజయ్, భూపతి ప్రసాద్, దాసరి బాబి తదితరులు పాల్గొన్నారు.