కరాటే విజేత సతీష్ కుమార్ ను అభినందించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఫిబ్రవరి 12వ తేదీన నిడదవోలులో జరిగిన మూడు రాష్ట్రాల కరాటే పోటీలలో విజేతగా నిలచిన ఏలూరుకు చెందిన జి.సతీష్ కుమార్ ను జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు జనసేన ఏలూరు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే కరాటేను కేంద్ర ప్రభుత్వం క్రీడారంగంలో గుర్తించడం జరిగిందని, అటువంటి కరాటే పోటీల టోర్నమెంట్లో ఏలూరు కు చెందిన జి సతీష్ కుమార్ పాల్గొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్లో స్టేట్ ఫస్ట్ సాధించేందుకు తర్ఫీదు ఇచ్చిన కోచ్ రామును అభినందించారు. ఇదేవిధంగా ఏలూరు నగర ఖ్యాతిని కరాటే రంగంలో ప్రతిభ కనబరిచే విధంగా, అన్ని రకాలుగా రాణించాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరాటే రంగంలో ఏలూరు ప్రతిభను చాటే విధంగా సతీష్ కుమార్ తన నైపుణ్యాన్ని పెంపొందించుకొని, క్రీడారంగంలో తన ప్రతిభను చాటాలని రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు.