క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములవ్వండి: షేక్ హసన్ భాష

రాయచోటి, జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని రాయచోటి అసంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష పిలుపుఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ హసన్ భాష మాట్లాడుతూ.. జనసేన పార్టీ కార్యకర్తలు కోసం తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. యావత్ భారత్ దేశంలో ఏ రాజకీయ పార్టీలు చేయనటువంటి కార్యక్రమం కేవలం జనసేన మాత్రమే చేస్తుంది. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలానే జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసే జనసైనికులకు భరోసా ఇస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడి, దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని పని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడోవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10వతేదీన మొదలై ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగుతున్నది కావున జనసైనికులు, యువకులు, పార్టీ సానుభూతి పరులు, అభిమానులు, మద్దతుదారులు, మీకు అనుకూలమైన పట్టణ, మండల, గ్రామాల, ఆయా ప్రాంతాల్లో క్రియాశీలక వాలంటీరులను సంప్రదించి మనకున్న సమయంలో సద్వినియోగం చేసుకుంటారని పిలుపునిచ్చారు. ఒక్కో సభ్యత్వ రుసుము ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 500 రూ చెలించాలి, ప్రమాద భీమా 24 గంటల్లో జనసేనపార్టీ నుంచి 50,000 రూ అందిస్తారు. అలానే ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా 5,లక్షల రూపాయలు జనసేనపార్టీ అందజేస్తుంది. అలానే పార్టీ పదవుల్లో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, సిబ్యాల నాయకులు చిన్నారి జయరామ్, ఖాసిమ్, శమీర్, వెంకటేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.