నేడు నింగిలోకి ‘పీఎస్ఎల్వీ సీ 50’..

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. కమ్యూనికేషన్ శాటిలైట్ పీఎస్ఎల్వీ సీ-50 ద్వారా గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకు నింగిలోకి పంపనున్నారు. ఈ మేరకు ప్రయోగం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగానికి బుధవారం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2.41 గంటలకు ప్రారంభమై.. నిరంతరాయంగా 25 గంటల పాటు కొనసాగనుంది. భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. దీని పరిమితి భారత్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు విస్తరించనుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *