మోటూరి దంపతులకు ఘన సత్కారం

గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం, పాసర్లపూడి లంక గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పాసర్లపూడి లంక జనసేన పార్టీ సారథ్యంలో గ్రామ కమిటీ సారధ్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తెలగరెడ్డి ఏసుబాబు, ఎంపీటీసీ చెరుకూరి పార్వతీదేవి సత్తిబాబు వారి సమక్షంలో జనసేన పార్టీలో ఎక్కడ ఆపద అన్నా ఎక్కడ ఆకలి కేకలు విన్నా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పోతుల కాశీ, మద్ధింశెట్టి బుజ్జి, బల్ల సతీష్, గోగి గోపి, సుధాకర్, మేడేపల్లి సత్తిబాబు, ఎరుబండి శివ, చేగొండి శివ తదితరులు పాల్గొన్నారు.