విద్యార్థుల మరణాలను అరికట్టాలి: వంపూరు గంగులయ్య

  • విద్యార్థులకు సరైన చికిత్స అందించాలి..!
  • ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల మరణాలకు ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
  • జనసేన పార్టీ అరకు, పాడేరు ఇంచార్జ్ వంపూరు గంగులయ్య.

చింతపల్లి: ఆరోగ్య కార్యకర్తలను పునఃనియమించాలంటే ఇంకా ఎంతమంది విద్యార్థులు మరణించాలి. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల మరణాలకు ఈ వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు? అని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అరకు, పాడేరు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు జిల్లా చెందిన ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థుల మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అసలు ఈ ప్రభుత్వానికి కనీకారామనేది ఏమైనా ఉందా?నా కుటుంబ సభ్యులంటు జగన్ రెడ్డి చెప్పే మాటలన్నీ సవితి తల్లి ప్రేమనన్నే మాట తప్ప..వాస్తవంగా గిరిజనులంటే సీఎంకి, వైసీపీ వాళ్లకు ఇష్టముందంటూ మాట తప్ప గిరిజన బిడ్డల మీద కనీకారం అసలు లేదు. పసి బిడ్డలు చనిపోతున్నా పట్టదు. విద్యార్థులు ప్రాణాలు పోతున్నా స్పందించరు. నేను అడుగుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు కనీసం మానవత్వం లేకుండా నాయకులు ఉన్నరు. ఎందుకు పదవులు పట్ల వ్యామోహం? నేటి బాలలే ఈనాటి పౌరులు అని అంటారు కానీ ఆ బాలలే రోజుకి ఒకరు, నెలకు ఒకరు మరణించడం అదే మీ నెల వారి జీతమా…? ఈ గిరిజన విద్యార్థుల మరణాల పట్ల పూర్తి భాద్యత ఈ వైసీపీ ప్రభుత్వానీదే.. ఈ ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంపీలదే.. ఇలాంటి విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. మరణించిన విద్యార్థుల కుటుంబలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి ఆశ్రమ పాఠశాలలో, కళాశాలలో సరైన ఆరోగ్య కార్యకర్తలను నియమించి వారి యొక్క అనారోగ్య పరిస్థితులను తొలిగించేటట్లు, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండే విధంగా ముందు చూపు చూడాలని అధికారం ప్రభుత్వాన్ని గంగులయ్య హెచ్చరించారు.