కొత్తగుంట స్మశానాన్ని పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీలో సోమవారం కొత్తగుంట స్మశానాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లి గ్రామ పంచాయతీలో ఐదు కులాల వారు వినియోగించుకునే కొత్తగుంట స్మశాన వాటిక గత సంవత్సరం నుంచి ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా స్మశానం వర్షాకాలంలో నీళ్లతో నిండిపోతే శవాన్ని పూడ్చడానికి చాలా ఇబ్బంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్మశానానికి మట్టితోలించండి అని చెప్పి మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు కనీసం గ్రావెల్ తోలుస్తామనేటువంటి ఆలోచన రాకపోవడం సిగ్గుతో కూడినటువంటి విషయం. 20 రోజుల క్రితం ఎమ్మార్వో ఆఫీస్ లో స్పందనలో అర్జీ కూడా ఇచ్చాం. కానీ 20 రోజులు అవుతున్న గాని స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. అయితే ఈ రోజు మీడియా పూర్వకంగా ప్రభుత్వ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం, 15 రోజుల లోపల కొత్తగుంట స్మశానానికి గ్రావెల్ తోలించే ఏర్పాటు చేయకపోతే మండల కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహారదీక్షకి జనసేన పార్టీ కూర్చుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.