అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన బత్తుల

  • షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించి, ₹ 20,000/-. రూపాయల ఆర్థిక సహాయం, 25 కేజీలు బియ్యం బస్తా అందజేత

రాజానగరం, మండల కేంద్రమైన కోరుకొండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రధాన రహదారి వద్ద సంభవించిన సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు రెండు షాపులు అగ్నికి ఆహుతి కాగా, విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి హుటాహుటినా బయలుదేరి వెళ్లి జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బాధితులను పరామర్శించడం జరిగింది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలించి, జనసేన పార్టీ తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించి తక్షణ సాయంగా ఇల్లు కోల్పోయిన కోవూరు లోవరాజుకు ₹10,000/- రూపాయలు, 25 కేజీలు బియ్యం, చిన్న షాపులో పుచ్చకాయలు అమ్ముకునే చింతా నారాయణకి ₹ 5,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం, మరోపక్క ఇనుప పనిముట్లు అమ్ముకునే చింత సుబ్రహ్మణ్యంకి ₹5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి, ధైర్యం చెప్పి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన వారిలో జనసేన నాయకులు, జనసైనికులు ఉన్నారు.