వేగ న్యూస్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ ను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు కొద్ది రోజులుగా అనారోగ్య రీత్యా హాస్పటల్లో చికిత్స పొందుతూ తిరిగి ఇంటికి వచ్చినటువంటి వేగ న్యూస్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ ను పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ శుక్రవారం పరామర్శించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సాయం అందించడం జరిగింది. వేగ న్యూస్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ ను పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సలహాలను సూచనలు అందజేయడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ మీడియా అన్నది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకునే అవసరం ఎంతైనా ఉందని కాని ఈ గవర్నమెంట్ ఈ మీడియా మిత్రులకు చేసిందేమీ లేదని పైగా గత ప్రభుత్వం వారు ఇచ్చిన హెల్త్ కార్డులు గాని పిల్లల చదువుల విషయంలో రాయితీలు ఉండే స్కీములు ఉండేవి కానీ ఈ ప్రభుత్వం వాటి అన్నిటిని తుంగలో తొక్కినట్లు వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వానికి తన సొంత మీడియా తప్ప మిగతా మీడియా ఎదగకూడదు మనకు ఆపోజిట్ గా, ఇతర ఇతర పార్టీలకు సపోర్టుగా రాసిన వాస్తవాలను రాసినా గాని ఆ మీడియాని తొక్కేయాలన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ఈ దురాక్రమణ పాలన మేము తీవ్రంగా జనసేన పార్టీ వైపు నుంచి ఖండిస్తున్నాము. ఈ జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మేము అండగా ఉంటామని ఈరోజు నా తోటి సోదరుడిగా నేను జర్నలిస్టు శ్యాం ప్రసాద్ ని పరామర్శించడం జరిగిందని, జర్నలిస్టులో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేను ఒక అన్నగా తమ్ముడిలా వాళ్లకు తోడుగా అండగా ఉంటానని అలాగే వాళ్లకు ఏ అన్యాయం జరిగినా సహించే ప్రసక్తి లేదని దాని కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పిన జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు సాక్షి మీడియాని పేపర్ ని బ్యాన్ చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు అందరూ కలిసికట్టుగా అధికార ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి సాక్షి ఛానల్ ని కాపాడారు కానీ ఈరోజు ఒక మీడియా ఛానల్ అధినేత అయ్యుండి కూడా ఈ ముఖ్యమంత్రి ఈ మీడియా వాళ్లను పట్టించుకోవడం లేదు అని నీతిగా నిజాయితీగా బ్రతికే జర్నలిస్ట్ అందరికీ కూడ ఈ ప్రభుత్వం అండగా ఉండాలని, జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఆథరైజ్డ్ జర్నలిస్టులందరికీ కూడా అనేక మంచి కార్యక్రమాలు చేపడతామని పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు.