గుగ్గిళ్ళ వెంకటయ్యకు నివాళులర్పించిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు మరియు వీరబల్లి మండలంలోని సానిపాయి గ్రామపంచాయితీ జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున తండ్రి గుగ్గిళ్ళ వెంకటయ్య (డీలర్) అనారోగ్యంతో తిరుపతి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. వారి స్వగ్రామం నేతివాండ్లపల్లిలో అంత్యక్రియలు సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొని ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.