కోనేటి హరి వెంకటరమణకి మద్దతుగా ప్రచారం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థి కోనేటి హరి వెంకటరమణకి మద్దతుగా జనసేన నాయకులు ప్రభు ఆధ్వర్యంలో సిద్ధవటం గ్రామం, గాంధీ వీధిలో ప్రతి ఓటర్ ఇంటికి, సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఎస్.బి.ఐ బ్యాంక్ లో తిరిగి ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని మరియు హరి వెంకటరమణ పోరాటాలను ప్రజలకు వివరించారు. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సానుకూలంగా స్పందన రావడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సిద్ధవటం మండల ఇంచార్జ్ కొట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, నాగరాజు మరియు రేవన్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-14.48.50-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-10-at-14.48.51-1024x461.jpeg)