మహిళా సాధికారితే జనసేన లక్ష్యం: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు టౌన్: గొల్లప్రోలు టౌన్ కర్ణం గారి తోటలో జనసేన వీరమహిళల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన వీరమహిళలు ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారిని ఆహ్వానించి, పూల మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలు స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని మహిళల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా, మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. మహిళ అంటే చిన్న చూపు తగదని, సమాజ నిర్మాణం లో మహిళలదే కీలక పాత్ర అన్నారు. ప్రతి ఇంటి లో మహిళను పురుషులతో సమానంగా చూడాలని అన్నారు. ఆడ, మగ పిల్లల్ని తేడాలు లేకుండా పెంచాలన్నారు. సమాన అవకాశాలను, విద్యనూ, నైపుణ్యాన్ని ఆడ పిల్లలకు ఇచ్చినప్పుడే ఈ థీంను సాధించగలమన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట స్త్రీలు ఆర్ధికంగా, వారి స్వశక్తిపై వారు నిలబడాలన్న వారికి చట్ట సభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అభ్యర్థి వినుకొండ అమ్మాజీ, వీరమహిళలు వినుకొండ శిరీష, అమ్మాజీ, నాగలక్ష్మి, లక్ష్మి, అనూష, పావని, రమ్య, జ్యోతి, దేవి, మణికటమ్మ, మణి, దేవి, శిరీష, తాతాజీ, రాజా చక్కర దొర, హరీష్, శివ, నాని, ఎసు బాబు, రాజు, లక్ష్మణ్, గంగబాబు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.