పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల షెడ్యూల్

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు. 11వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి చేరుకుంటారు. పార్టీ అధ్యక్షుల కార్యక్రమాల వివరాలు..
11-03-2023
మధ్యాహ్నం 2 గం. – బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యాలయం
12-03-2023
ఉదయం 11గం. – పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష. పార్టీలో చేరికలు
మధ్యాహ్నం 2 గం. – శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారి నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ
13-03-2023
ఉదయం 11గం. – ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష
సాయంత్రం 5 గం. – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారితో మర్యాదపూర్వక భేటీ
14-03-2023
మధ్యాహ్నం 1 గం. – మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం సభకు బయలుదేరుట
2 గం. – ఆటోనగర్ గేట్ దగ్గర స్వాగతం
– తాడిగడప జంక్షన్
– పోరంకి జంక్షన్
– పెనమలూరు జంక్షన్
– పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్ దగ్గర) మీదుగా
5గం. – మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు