బుక్కరాయసముద్రం మండలంలో ఘనంగా టి సి వరుణ్ జన్మదిన వేడుకలు

బుక్కరాయసముద్రం: శనివారం జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ జన్మదినం సందర్భంగా బుక్కరాయసముద్రం మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి గుడిలో టి సీ వరుణ్ పేరు మీద అర్చన చేయించి, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ చేయించి, అనంతపూర్ జిల్లాకు టిసి వరుణ్ గారు చేసిన సేవలు ఎనలేనివని తెలియజేస్తూ.. రాబోయే రోజుల్లో రాజకీయంగా అనంతపురం జిల్లాలో మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదినం వేడుకులను చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి, మండల నాయకులు రాజు, అశోక్, ఏకాంత తదితరులు పాల్గొనడం జరిగింది.