సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారాలు- 2021 కోసం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతిభావంతులు, సమాజ సేవలో ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వేజనాః సుఖినో భవంతు సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ ఈఎ్‌సఎస్‌ నారాయణ మాస్టారు తెలిపారు. ఆదివారం నాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి ప్రతిభా పురస్కారాలకు, సంక్రాంతి సాంస్కృతిక పోటీల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

సమాజ సేవ, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం, యోగా, కరాటే, మెమోరీ పవర్‌ తదితర అంశాల్లో ప్రతిభావంతులైన, సేవలందిస్తున్న వారు తమ సేవలకు సంబంధించిన పత్రాలు, ఫొటోలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌తో పాటు 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ పోటోలను జతచేసి జనవరి 2వ తేదీలోపు సికింద్రాబాద్‌, గోకుల్‌నగర్‌, తిరుమలగిరిలోని సర్వేజనాః సుఖినో భవంతు(డోర్‌ నెం.1-20-10, మొదటి అంతస్తు)కు పంపించాలన్నారు. జనవరి 24న పురస్కారాల ప్రధానోత్సవం ఉంటుందని, సంక్రాంతి సాంస్కృతిక పోటీలను పాటలు, పద్యాలు, లలిత గేయాలు, అన్నమాచార్య, త్యాగరాజు కీర్తనలు, శోక్లాలు, తబల, మృదంగం, గిటార్‌, కీబోర్డు, వయోలిన్‌, వీణ, శాస్త్రీయ జానపద, సినిమా(సోలో, డ్యూయేట్‌, గ్రూప్స్‌), డ్రాయింగ్‌, పెయింటింగ్‌, మిమిక్రీ, మ్యాజిక్‌, ఏకపాత్రభినయం, యోగా, కరాటే తదితర విభాగాల్లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. వివరాలకు 9652347207 నంబర్‌లో సంప్రదించాలన్నారు.