క్రియాశీల వాలంటీర్ల సన్మానానికి కందుల దుర్గేష్ కు ఆహ్వానం

తుని నియోజకవర్గం, జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని, మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. తుని నియోజకవర్గంలో పార్టీ స్థితి గతులను, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో చర్చించి అధ్యక్షుల వారి సలహాలు తీసుకోవడం జరిగింది. అలానే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన క్రియాశీల సభ్యత్వాలు నమోదు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన క్రియాశీల వాలంటీర్ లని, సన్మానం చేసుకునే విధంగా త్వరలో ఒక అభినందన సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని. దానికి అధ్యక్షులు కందుల దుర్గేష్ ని తుని జనసేన నాయకులు రాజా శేషు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.