ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవము

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాల మండలం, చాగంటివారి పాలెం గ్రామంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాస్ రావు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా మాదల మహంకాళి అమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి, అనంతరం ర్యాలీగా మాదల గ్రామంలో ఉన్న జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, ర్యాలీగా నూతన కార్యాలయం వద్దకు చేరుకొని ఆఫీస్ ముందు ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించి అనంతరం నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాబోయే రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారి కోరిన మార్పు మేరకు జనసేన పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లడం ఖాయం ఈ వైసీపీ అభ్యర్థులను ఓడించడం తథ్యం అనీ తెలియజేశారు. రాబోయే రోజుల్లో 2024 ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ వైసీపీ నాయకులను, వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సమస్యల్లో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడి వారి తరపున పోరాటం చేయాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో నిండిపోయిన ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దించి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జిలాని మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి లాంటి నీతి నిజాయితీగల వ్యక్తిని ప్రజలందరూ ఒక్కసారి చూడాలని రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శలు సిరిగిరి శ్రీనివాసరావు, చట్రాల త్రినాద్, నియోజవర్గ పార్టీ కార్యాలయం ఇంచార్జ్ సిరిగిరి మణికంఠ, పాకనాటి అమూల్య, ఎంపీటీసీ శిరిగిరి రామారావు, నాయకులు పాకనాటి రమాదేవి,రాజనాల నాగలక్మి, మధు లాల్, పరమేశ్వరరావు, తిరుమలశెట్టి మల్లేశ్వరి, శూలం రాజ్యలక్ష్మి, పోతంశెట్టి శ్రీనివాసరావు, గ్రంధి సదాశివరావు, పమిడిపాడు శ్రీనివాసరావు, సూరిశెట్టి సతీష్, జిల్లా ముఖ్య నాయకులు, ముప్పాళ్ళ మండల అన్ని గ్రామ అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.