నిఖితది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యే: వంగ లక్ష్మణ్ గౌడ్

• నిఖిత హత్య వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం
• బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తల్లులని బలి చేస్తున్నారు
• ప్రభుత్వ గురుకుల పాఠశాలలోనే బాలికలకు రక్షణ లేదు
• నిఖితకు న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది.
• అండగా నిలవాల్సిన స్థానిక ఎమ్మెల్యే దళిత బంధు ఇస్తానని చెప్తున్నారు
• మీరు శాసన సభ్యునిగా గెలిచినప్పుడు చిన్నారి నిఖిత మీ గెలుపుకు కొలంట్లు వేసింది గుర్తుందా….?
• స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి సిగ్గు శరం ఉందా….?

  • జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో 7వ తరగతి చదువుతున్న వంకేశ్వరం గ్రామానికి చెందిన చిన్నారి నిఖిత నాగెళ్ళ (13) ఈ నెల 6వ తేది సాయంకాలం క్లాస్ రూమ్ లో ఉరేసుకొనీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అన్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యే అని జనసేన పార్టీ
మంగళవారం వంకేశ్వరం గ్రామంలో చిన్నారి నిఖిత ఇంటికి వెళ్ళి వారి తల్లి తండ్రుల దగ్గర జరిగింది తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నిఖిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ
• మా కూతురు చనిపోతే కూడా స్కూల్ యాజమాన్యం మాకు చెప్పలేదని
• పోస్ట్ మార్టం తెల్లవారుజామున 3గంటలకు హుటాహుటిగా చేసారని
• స్థానిక ఎమ్మెల్యేకి పిర్యాదు చేస్తే మీకు 2ఎకరాల భూమి రిజర్వేషన్ చేస్తా, దళిత బంధు ఇస్తా అన్నారని
• మా పాప ఉరేసుకొని చనిపోయినప్పుడు, కర్త భాగంలో దెబ్బ ఎందుకు తగిలింది, ఛాతీ భాగంలో దెబ్బలు తగిలాయి, భుజాలకు బెల్ట్ తో కొట్టిన దెబ్బలు ఉన్నాయని
• మాకు డబ్బు వద్దు, భూమి వద్దు, ఏ బంధు వద్దు, మా కూతురిని చంపింది ఎవరో మాకు తెలియాలి, మాకు న్యాయం జరగాలి అంటూ తల్లి తండ్రులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు.

అనంతరం వంగ లక్ష్మణ్ గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి నిఖిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం
పాఠశాల వద్దకు వెళ్లి నిఖిత క్లాస్ రూమ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ
• నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి, ప్రభుత్వ అధికారులకు, సిగ్గు శరం ఏమైనా ఉందా….?
• మన దళిత బిడ్డ చనిపోతే పట్టించుకోరు, ఇక్కడ ఉన్న ఎమ్మేల్యే మన దళిత సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి, నాగర్ కర్నూల్ ఎం.పీ మన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అధికార దాహంతో నిండిన ఈ ప్రభుత్వ పాలకులకు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు….
• బంగారు తెలంగాణ అని మాయ మాటలు చెప్తూ, మభ్య పెడుతూ మన ఇంటి బంగారు తల్లులను బలి చేస్తున్నారు.
• చిన్నారికి ప్రేమ వ్యవహారం ఉంది, దాని వలనే ఊరి వేసుకుంది అని అంటున్నారు. ఆ పసి బిడ్డపై ఇలాంటి నిందలు వేయడానికి మీకు బుద్ధి ఉందా…?
• మీరు ఆరోపించినట్టు ఉరి వేసుకుంటే పాపకు కర్త భాగంలో, భుజం భాగంలో, ఛాతీ భాగంలో ఎందుకు దెబ్బలు ఉన్నాయ్….? పాప కాళ్ళకి చెప్పులు లేవు. మరి పాదాలు కాకుండా చెప్పుల అచ్చులు ఉంది ఎవరివి…? అంత చిన్న పాపకి అంత పైన ఉన్న ఫ్యాన్, కనీసం పాప బెంచ్ ఎక్కితే ఫ్యాన్ కి కూడా చిన్నారి నిఖిత చేతులు అందవు.. ! ఎలా జరిగింది….??
• ప్రభుత్వ అధికారుల అండతో చిన్నారిని చంపింది ఎవరు….? స్థానిక అధికారులు నిఖిత చావును పక్క పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అంటున్నారు.
మరి చిన్నారికి న్యాయం చేయకుండా మీకు దళిత బంధు ఇస్తాం, భూమి ఇస్తాం సైలెంట్ గా ఉండండి అని మీరు ఆ కుటుంబీకులకు ఎందుకు చెప్పారు.
• చిన్నారి నిఖిత చావు వెనక ఉన్న కుట్ర తెలియాలి. ఈ హత్యలో ఎవరెవరికి హస్తం ఉందో తెలియాలి. చిన్నారి నిఖీతకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించేంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ నాయకులు
జానవత్ శ్రీరామ్ నాయక్, జెర్రిపాటి చంద్ర శేఖర్, మహేష్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు భోట్క రమేష్, సూర్య, వంశీ రెడ్డి, ఎడ్ల ప్రసాద్, రాజు నాయక్, పూస శివ, విక్కి, నాగరాజు, పెమ్, మరియు జనసైనికులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.