మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే: దారం అనిత

మదనపల్లి, సరైన మౌళిక సదుపాయాలు లేని కనీసం రోడ్లమీద గుంతలకు ప్యాచ్ లు కూడా వేయలేని ముఖ్యమంత్రి కావాలో, అలాగే ప్రభుత్వ సొమ్ము ప్రజలకు కాకుండా గోడలకు, బండ్లకు రంగులు వేసే ముఖ్యమంత్రి కావాలో, తమకు కేటాయించిన శాఖలను అభివృద్ధి చేయడంలో కాకుండా కేవలం ప్రతిపక్షాలను ప్రజలను బూతులు తిట్టే పనిలో ఉన్న మంత్రులను పెంచి పోషిస్తున్న ముఖ్యమంత్రి కావాలా లేదంటే అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరిన్ని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని భూమిలోకి దించడమే కాకుండా రాష్ట్ర రూపరేఖలే మార్చే ఆలోచనలో మూడుముక్కల చేసే ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలా వీటన్నిటికి భిన్నంగా తను సంపాదించిన సంపాదనంతా ప్రజలకే ఖర్చు పెడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా మీరే ఆలోచించుకోండి. ఈసారి మాత్రం మీ ఆలోచన సరైనది కాకపోయినా మీ ఓటు సరైన వ్యక్తికి వేయకపోయినా మీకున్న మంచి ఆలోచనలన్నిటిని మరిచిపోవాల్సిందే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాధుడే ఉండడు మీ ఇష్టమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.