ప్రభుత్వాలు, అధికారులు మారినా అయ్యవారిపేట రోడ్లు బాగుచేసే నాధుడే లేరు

  • జనసేన ఎంపీటీసీ విక్రమ్

ఆమదాలవలస నియోజకవర్గం, అయ్యవారిపేట గ్రామ ప్రదాన దారి దాదాపుగా 20ఏళ్ల పై నుంచి మరమ్మతులు చేయలేదని, సర్పంచ్ కి చెపితే ఆర్ అండ్ బీ అధికారులకి పిర్యాదు చేయాలి అని.. వారికి సమస్య చెపితే గ్రామ నిధులు లెవవు అని ఇలా వాయిదాలు వేస్తు ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం లేదని గ్రామ ప్రజలు పిర్యాదు చేయగా స్థానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్, మామిడి నారాయణ రావు, గేదేల వాసు, వినోద్, రుద్ర తదితరులు వెళ్లి రోడ్డుని పరిశీలించి దీనిపై జనసేన తరుపున పరిష్కార మార్గం వచ్చేలా చేస్తాం అని గ్రామ ప్రజలకు మాట ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మొదటిగా జిల్లాలో మొదటి జనసేన ఎంపీటీసీ గా గెలిపించిన గ్రామానికి తప్పకుండా పెద్ద పెద్ద సమస్యలు సులభంగా పరిష్కారం చేస్తానని ఎంపీటీసీ భరోసా ఇచ్చారు. అంతేగాక నేను పుట్టిన ఊరు కొల్లివలస అయిన నాకు ఆ ఊరితో పాటు సింగన్నపాలెం, అయ్యవారిపేట గ్రామం సొంత ఊరిగా బావిస్తూ మీకు కడ శ్వాస వరకు తోడుగా ఉంటానని జనసేన పార్టీ తరుపున భరోసా ఇచ్చారు.