బోయ వాల్మికులను ఎస్టీలో చేర్చే తీర్మానాన్ని ఉపసరించుకోవాలని జనసేన డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం బోయ వాల్మికులను ఎస్టీలో చేర్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఉపసరించుకోవాలి వ్యతిరేకంగా అని పాడేరు జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాడేరు మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీలో బోయవాల్మికులను, ఎస్టీలో చేర్చాలని, తీర్మానానికి వ్యతిరేకంగా, ఈ సందర్భంగా జనసేన పార్టీ జీ.మాడుగుల మండల సీనియర్ నాయకులు మసాడి సింహాచలం, మాట్లాడుతూ ఎస్టీలకు, రిజర్వేషన్, సరిపోక గిరిజనులు, ఉన్నతమైన, చదువులు, చదువుకొని, ఖాళీగా ఉన్నారని కానీ ఇప్పుడు బోయవాల్మికులను ఎస్టీలో చేర్చి గిరిజనులకు అన్యాయం చేయడమే అని తెలిపారు. అలాగే పాడేరు మండల అధ్యక్షులు, నందొలి మురళీకృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో బోయవాల్మికులను ఎస్టీలో చేర్చాలని తీర్మానాన్ని, ప్రవేశపెట్టినప్పుడు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు, మాట్లాడక పోవడానికి కారణం ఏమిటి అన్నారు. గిరిజనులార తెలుసుకోండి, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీల పదవుల కోసం మన హక్కులు, రిజర్వేషన్లపై దాడి జరుగుచున్న నోరు తెరిచి మాట్లాడని మన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఆలోచన ఎంటి అనేది తక్షణమే గిరిజనులకు తెలియజేయాలి, కనీసం ఎదురించి మాట్లాడే దైర్యంలేని మీరు తక్షమే మీ పదవికి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అలాగే గిరిజనుల, గిరిజన ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన మీరు ఆ పదవికి అర్హులు కాదు, తక్షణమే రాజీనామా, చేయాలని కోరారు అలాగే, బోయ వాల్మికులను ఎస్టిలో చేర్చాలని తీర్మానాన్ని వెనుకకి తీసుకొని మరుక్షణం నిరసన ఉదృతం చేస్తామని జనసేన పార్టీ జీ.మాడుగుల సీనియర్ నాయకులు మాసాడి సింహాచలం, జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ తెలియజేయడం జరిగింది. అలాగే గిరిజనులకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆదివాసీ జేఏసీ సంఘం నాయకులు, జనసేన పార్టీ, జనసైనికులు పాల్గొన్నారు.