పిఠాపురం టౌన్ జనసేన పార్టీ కమిటీ నియామకం

  • టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు కమిటీ సభ్యులకు సన్మాన కార్యక్రమం.
  • జనసేన పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ స్వర్గీయ కోలా ప్రసాద్ కు ఘనమైన నివాళిలు అర్పించిన మాకినీడి శేషు కుమారి జనసేన పార్టీ ఇన్చార్జ్.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతమైన దిశగా నిలబెడుతూ, నిజాయితీ గల నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ, జనసేన పార్టీ ఇంచార్జి మాకినిడి శేషు కుమారి నాయకత్వం వర్ధిల్లాలంటున్న జనసైన్యం. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని, పిఠాపురం టౌన్ పాత బస్టాండ్ ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ జనసేన కమిటీ నియామకం జరిగినది. ఈ కమిటీలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, మహిళ అధ్యక్షులు, కమిటీ నాయకులుగా, పలువురు కమిటీ సభ్యులుగా, పలువురి నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ, నిజాయితీగల నాయకుడు, మా జనసేన పార్టీ రాష్ట్ర అధినేత పవన్ కళ్యాణ్ వారు మాత్రమేనని, వారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, మా నాయకుడి కూడా ప్రయాణించడం అది మా పూర్వజన్మ సుకృతం అని, ప్రాణం ఉన్నంతవరకు జనసేనాని నాయకత్వంలోనే, నిజాయితీగల ప్రజాసేవ కోసం పనిచేస్తామని, రేపు రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం మన నిజాయితీగల నాయకుడు జనసేనానికి, రేపటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సహకరిస్తారని, సహకరించాలని, ప్రజల్లో మార్పును ఇప్పటికే జనసేనాని తీసుకువచ్చారని, నిజాయితీగల నాయకుడు, ఏ అవినీతి మచ్చా లేని జనసేనాని వెంట, ప్రతి ఒక్కరూ నడవడానికి సిద్ధంగా ఉన్నారని, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడేది, ఒక్క పవన్ కళ్యాణ్ వారు మాత్రమేనని, ఈ సందర్భంగా జరిగిన ఈ సమావేశం కార్యక్రమంలో పలువురు పిఠాపురం టౌన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. గత రెండు సంవత్సర కాలం కిందట పిఠాపురం టౌన్ అధ్యక్షులుగా ఉన్న స్వర్గీయ కోలా ప్రసాద్ కు ఘనమైన నివాళులు ముందుగా అర్పిస్తూ, వారు చేసిన సేవలను తలుచుకుని, ఈరోజు వారిని స్మరించుకుంటూ, జనసేన పిఠాపురం ఇన్చార్జి మాకినీడి శేషు కుమారి ఎంతో విచారణ వ్యక్తం చేశారు. మన మధ్య ఒక మంచి నాయకుడు పార్టీకి సేవలు అందించిన గొప్ప నేతను లేకపోవడం మన దురదృష్టమని, విచారం వ్యక్తం చేస్తూ, కోలా ప్రసాద్ భార్య కోలా దుర్గ ను పిఠాపురం టౌన్ మహిళా అధ్యక్షులుగా నియమిస్తూ, వారి సేవలను జనసేన పార్టీకి సహకారాలు అందించే విధంగా ఆమెకు తోడుగా ఉంటామని భరోసానిస్తూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, అధికార ప్రతినిధి తోలేటి శిరీష వారి సూచనలతో మహిళా కమిటీ సభ్యులను యూత్ కమిటీ అధ్యక్షులను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పిఠాపురం టౌన్ అధ్యక్షులుగా నియమితులైన బుర్రా సూర్యప్రకాష్ రావు వారిని, పలువురు కమిటీ సభ్యులను జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు మధ్య అభినందనలు తెలియజేశారు. పిఠాపురం పట్టణ అధ్యక్షులు బుర్రా సూర్యప్రకాష్ గౌరవ అధ్యక్షులు వేణు నారాయణరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులు వాడ్రేవు చలపతిరావు, వేల్పుల చక్రదరరావు, పల్నాటి మధు, మైనాబత్తుల చిన్నా, కసిరెడ్డి నాగేశ్వరావు, పేదిరెడ్ల భీమేశ్వరరావు ప్రధాన కార్యదర్శులు బొజ్జా కుమార్, గరగా బాబీ, కొండేపూడి శివ, రాయవరపు శివదుర్గ, బెల్లంకొండ రవి, సికొలు రాజశేఖర్, మనుగుల వెంకటేష్ కార్యదర్శులు నామ శ్రీకాంత్, పబ్బినీడి దుర్గా ప్రసాద్, పసుపులేటి గణేష్, కారపురెడ్డి వీరమణికంఠ, గెంజి సురేష్, మందవరపు సంతోష్, ముగ్గు అంజిబాబు, దుర్గాడ సత్తిబాబు, అల్లం కిషోర్, శిరం లోవరాజు సంయుక్త కార్యదర్శులు రెడ్డి మనోహర్, తోట సతీష్, షేక్ నజీర్, సింహాద్రి వీరబాబు, డాకే ప్రసాద్, పిట్టా చిన్నబాబు, దాసరి సుభ్రమణ్యం, చక్కపల్లి వినయ్, బుద్దాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్లు అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ, మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు వేణు నారాయణరావు, కర్రి కాశి విశ్వనాధ్, కౌన్సిలర్ అభ్యర్థి పల్నాటి మధు, కోలా దుర్గ, బొలిశెట్టి వెంకటలక్ష్మి, గోపు సురేష్, వినుకొండ అమ్మాజీ జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.