కళ్యాణదుర్గం జనసేన ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

కళ్యాణదుర్గం, మెగా పవర్ స్టార్ మరియు గ్లోబల్ స్టార్, ఆస్కార్ అవార్డు విజేత, కొణిదెల “రామ్ చరణ్” జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు రాఘవేంద్ర గుప్తా ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు జనసేన పార్టీ జనసైనికులు, నాయకులు బ్రహ్మసముద్రం మండలం అఖిలభారత చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాయుడు, అఖిలభారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రాఘవేంద్ర గుప్తా, షేక్ తార, వంశి, జోసెఫ్ కిషోర్, ఆర్.సి అనిల్, ముక్కన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.