స్పందనలో జనసేన వినతి

పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో ఇటీవల పెద్దయెత్తున నిధులు దుర్వినియోగం జరిగిన మాట అందరికీ విధితమే. అయితే, ఈ నిధులు దుర్వినియోగం విషయంపై, ఎంపిడిఓ గ్రామ సచివాలయంలో పంచాయతీ ప్రజల సమక్షంలో విచారణ చేపట్టి, రికార్డులు పరిశీలించగా అవినీతికి పాల్పడినట్లు నిర్థారించారు. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్డిఓ కూడా ఈ విషయం గూర్చి రెండవసారి ప్రజలందరి సమక్షంలో విచారణ జరిపి, రికార్డులను పరిశీలన చేయగా నిధుల్ని దుర్వినియోగపరిచినట్లు వెల్లడించారు. అందుకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లు కూడా ప్రజలందరి ముందు నేరాన్ని ఒప్పుకున్నారు. ఇందు విషయమై పెదమరికి పంచాయతీ వైస్ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పెద్దలు, ప్రజలు అనేక పర్యాయాలు ప్రభుత్వ అధికారులు దృష్టికి, ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి, విన్నవించి ఈ నెలతో సరిగ్గా 4వ, నెల పూర్తవుతుంది కానీ, సమస్యకు పరిష్కారం లభించకపోవడం శోచనీయం. నెలలు గతిస్తున్నా జాప్యం జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇంకా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజలకు ప్రభుత్వ అధికారులపై, చట్టాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. కావున శ్రీవారు తక్షణమే స్పందించి అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లతో రికవరీ కట్టించి, వారిని విధులు నుండి తొలగించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావున ఆ గ్రామ ప్రజలు జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. సోమవారం స్పందన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయుకులు, వీర మహిళలు, జనసైనికుల సమక్షంలో మరల వినతిపత్రం అందజేయడం జరిగింది. అయితే కలెక్టరు సానుకూలంగా స్పందించి సంబందించిన అధికారి అయిన డిఎల్డిఓని పిలిచి రెండు రోజులలో రిపోర్టు సమర్పించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మని, బొనెల గోవిందమ్మ, రాజాన బాలు, ఖాతా విశ్వేశ్వరరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థన్ రావు పైల రాజు, దుర్గ, జనసైనికులు, వీర మహిళలు, పెద మరికి పంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగింది.