ఘనంగా గంగారపు రామదాస్ చౌదరి పుట్టిన రోజు వేడుకలు

  • వచ్చే పుట్టిన రోజు వేడుకలు ప్రజా ప్రతినిధిగా ప్రజల మధ్య జరుపుకోవాలి
  • జనసేన పార్టీ నాయకుల ఆకాంక్ష
  • అభిమానులచే అన్నదాన కార్యక్రమాలు

మదనపల్లె: పిలిస్తే పలికే నాయకుడు, ప్రజల మనిషి, అందరివాడు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి వచ్చే పుట్టిన రోజు వేడుకలను ప్రజా ప్రతినిధిగా ప్రజల మధ్య జరుపుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం అధ్యక్షులు జగదీష్ నాయుని ఆకాంక్షించారు. ‌సోమవారం గంగారపు రామదాస్ చౌదరి 60వ పుట్టిన రోజు పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలో అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గంగారపు రామదాస్ చౌదరి మిత్రులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ‌సోమవారం ఉదయం నుండి గంగారపు రామదాస్ చౌదరి స్వగృహం వద్ద అభిమానులు, జనసేన పార్టీ నాయకుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. చిత్తూరు బస్టాండు సర్కిల్ వద్ద జనసేన పార్టీ నాయకులు అన్నదానం నిర్వహించారు. సందర్భంగా జంగాల శివరామ్ రాయల్, జగదీష్, అడపా సురేంద్ర, తోట కల్యాణ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రాజకీయాలలో కొనసాగుతూ, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే గంగారపు రామదాస్ చౌదరి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.‌‌ వచ్చే పుట్టిన రోజుకు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల మద్య ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోవడం రామదాస్ చౌదరి ప్రత్యేకత అన్నారు. మదనపల్లె జిల్లా కోసం నిర్వహించి ఉద్యమంలో చురుకుగా పాల్గొని మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని గళమెత్తారు.‌ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ విస్తృతంగా పర్యటనలు చేస్తూ పార్టీ బలోపేతం చేయడంలో విశేష కృషి సాగిస్తున్నారు.‌ ప్రజల మనిషి, ప్రజా నాయకుడు గంగారపు రామదాస్ చౌ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరి గంగారపు రామదాస్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ‌