పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చూడాలన్నదే మా ఆకాంక్ష

  • జనసేన పార్టీ మదనపల్లె ఇన్‌ఛార్జ్ గంగారపు స్వాతి రామదాస్ చౌదరి
  • ఘనంగా పుట్టినరోజు వేడుకలు

మదనపల్లె, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చూడాలన్నదే తమ ఆకాంక్ష అని జనసేన పార్టీ మదనపల్లె ఇన్‌ఛార్జ్ గంగారపు స్వాతి రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ‌మంగళవారం మదనపల్లె జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ గంగారపు స్వాతి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జగదీష్ నాయుని, గ్రానైట్ బాబు, గోపాలకృష్ణ, నాగవేణి, కుమార్, దేవేంద్ర, రాధికా, శర్వాణ, పాల్గొన్నారు. ‌ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. జంగాల శివరామ్ రాయల్, అడపా సురేంద్ర, జగదీష్ నాయుని మాట్లాడుతూ రాబోయే పుట్టిన రోజు వేడుకలను ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల మద్య ప్రజా ప్రతినిధిగా ఘనంగా పుట్టిన రోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటికి మునుపే 2010 సంవత్సరంలో పవనీజం కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎంపిపి హోదాలో విచ్చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‌అనంతరం 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించడం, 2019 లో జనసేన పార్టీ అభ్యర్థిగా మదనపల్లె నియోజకవర్గంలో పోటీకి దిగడం యాదృచ్ఛికంగా జరిగి పోయాయని అన్నారు. మదనపల్లె మండలం ఎంపిపిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. 2014 ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ‌అనంతరం గంగారపు స్వాతి మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.