పలు కుటుంబాలను పరామర్శించిన పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం గోకివాడ గ్రామానికి చెందినటువంటి గరగ గంగరాజు కుమారుడు గరగ చిన్న వెంకట్రావు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం పిఠాపురం నియోజకవర్గం గోకవాడ గ్రామానికి చెందినటువంటి బోడపాటి సూర్యుడు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం అందించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేమగిరి ఎల్లయ్య, బోడపాటి నాగేష్, గరగ నాని, గరగ మల్లికాసులు, గరగ చేక్రరావు, గరగ చిన్న, వెంకటరావు, గరగా సత్తిరాజు, దుడ్డు రాంబాబు, పల్నాటి మధుబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.