శ్రీరామ నవమి వేడుకలలో మోటూరి దంపతులు

అమలాపురం, శ్రీరామ నవమి సందర్భంగా చిందాడగరువు హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు ఆలయం వద్ద పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నందున మోటూరి వెంకటేశ్వరరావు కనకదుర్గ దంపతులు సత్తిబాబు దంపతులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, చిందాడగరువు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.