చిర్రి బాలరాజు సమక్షంలొ జనసేనలో చేరికలు

పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, మడకం వారి గూడెం గ్రామంలో నుంచి అధిక సంఖ్యలో మహిళలు యువత గ్రామ పెద్దలు సుమారు వంద కుటుంబాలు జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు నచ్చి చిర్రి బాలరాజు నాయకత్వంలో గిరిజనులందరు చేరి చిర్రి బాలరాజుకి అండగా ఉండాలని శ్రీరామనవమి సందర్బంగా రామాయలంలో హరతులు పట్టి చిర్రి బాలరాజు నాయకత్వాన్ని బలపరిచినారు. జనసేన యువత ద్వారా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చిర్రి బాలరాజు అన్నారు. గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలు మంచినీటి వసతి లేదు గ్రామానికి వెళ్లే దారి దుర్భర స్థితిలో ఉంది, బస్సు షెల్టర్ లేక మహిళలు ఎండలో నిలబడి ఉండవలసిన పరిస్థితి. మహిళలు, యువత ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో వ్యక్తం చేసారు. అధికార ఎమ్మెల్యే గిరిజనుడైనా మా గిరిజనులకు ఏ న్యాయం చెయ్యలేదని బాధను వ్యక్తం చేసారు. దీనికి స్పందించిన చిర్రి బాలరాజు మీ అందరికి అండగా ఉంటామని అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలు అందరు కలిసి జనసేన యూత్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్లే రోడ్ మరమ్మతులు, మహిళలకు సంభంధించి బస్సు షెల్టర్ జీలుగుమిల్లి మండల జనసేన పార్టీ తరపునుంచి ఈ రెండు కార్యక్రమాలు చేస్తామని వాగ్దానం చెయ్యడం జరిగింది. ప్రతి గిరిజన గ్రామాన్ని అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఉపాధ్యక్షలు దావిద్ రాజకుమార్, జీలుగుమిల్లి మండల ట్రైబుల్ జనసేన యూత్, వీరామహిళలు నాయకులు పాల్గొన్నారు.