జనసేన పార్టీ ఎప్పుడూ న్యాయం కోసం పోరాటం చేస్తుంది: శివదత్ బోడపాటి

పాయకరావుపేట, బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన ఉమ్మిడి వెంకటేష్ అనే వ్యక్తి యూగియ స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తూ డ్యూటీలో ఉండగా అనుమానాస్పదంగా మృతి చెందగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పరిస్థితిని అర్థం చేసుకునేలా వివరించిన తరువాత, యూగియా కంపెనీ యాజమాన్యం జరగబోయే తీవ్రతను గుర్తించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తక్షణ నగదు సహాయం 8.50 లక్షలు మరియు 25 నుంచి 35 లక్షల వరకు ఎంప్లాయ్ బెనిఫిట్స్ అందించే విధంగా ఒక డిఎస్పి, నలుగురు సిఐలు మరియు కొందరి అస్సైల సమక్షంలో అంగీకరించడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి తెలిపారు.