పంట కాలువపై కన్నేసిన భూబకాసురులు: ఎస్.వి.బాబు

పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలోని పంట కాలువ గట్టును తవ్వి రోడ్డుగా మార్చి కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించడం జరిగిందని, వైసిపి నాయకుల అండతోనే ఇదంతా జరుగుతుంది. మంత్రి అండదండలతోనే ఇదంతా జరుగుతుందని రైతులు అంటున్నారు. కృష్ణ డెల్టా కి నీరు అందించే కాలువలో ఒకటైన రామ్ రాజ్ ఛానల్ మెయిన్ కాలవ నుండి బల్లిపర్రు మరియు పాత బల్లిపర్రు గ్రామానికి సుమారు 700 ఎకరాలకు పైబడి నీరు అందించే పంట కాలువను ఒకవైపు గట్టును తవ్వేసి రోడ్డుగా మారుస్తున్నారు. ఈ కాలువకు మొగలో ఉన్న పాములు గుంటలోని మట్టిని కూడా అక్రమంగా తవ్వి సదరు వ్యక్తులు తమ సొంత భూముల్లో రోడ్లు వేసుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించిన బల్లిపర్రు రైతులను మీకు దిక్కున్న చోట చెప్పుకోమని సదరు మట్టి దొంగలు హెచ్చరిస్తున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు, ఆర్డీవో గారు స్పందించి పంట కాలువను కాపాడాలి. జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుంది. నీటి వనరులను, విలువైన మట్టిని కాపాడటంలో జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు తెలిపారు.