గిరిజన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, జీ. మాడుగుల మండలం, పెద్దలంక గ్రామంలో బుధవారం జీ. మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న , కొర్ర భాను ప్రసాద్ తో కలిసి గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం, అని పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, గిరిజన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు, అలాగే గిరిజన ప్రాంతాల్లో, రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. మన్యం ప్రాంతంలో పసుపు పండించాలి అంటే 1095 రోజులు పడుతుంది. ఇంత కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే పసుపు కేజీ ధర 40 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ధర కలిపించి గిరిజనులకు ద్రోహం చేస్తున్నారు. అలాగే కాఫీ, మిరియాలు, పిప్పలు, అనేక పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్ల గిరిజన యువత పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, గంజాయి పంటకు మక్కు చూపిస్తున్నారు. ఈ సందర్భంలో మేము చెప్పవలసింది ఎంటి అంటే, ఓట్లు కోసం అవసరం అయిన గిరిజన రైతులు, వాళ్ళు పండించే పంటకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడంలో వెనుకడుగు వేస్తున్నారు, గత టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గిరిజన రైతుల బ్రతుకు ఎందుకు మారటం లేదు? ప్రభుత్వలు మారినప్పటికీ గిరిజన కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన రైతులకు అండగా ఉంటాం అని తెలియజేశారు. అలాగే రైతుల పక్షాన నిలబడి ఉన్న పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. అలాగే గిరిజన రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలని వైసీపీ ప్రభుత్వంకి డిమాండ్ చేశారు. అలాగే రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మార్పుకి శ్రీకారం చుట్టి 2024 లో జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మీరు కూడా తోడ్పడాలని ప్రజానీకానికి తెలియజేశారు అలాగే, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చింది, అందరూ కంకణం కట్టుకొని 2024 ఓట్ల రూపంలో బుద్ది వచ్చే విధంగా గుణపాఠం చెప్పాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జీ. మాడుగుల మండల అధ్యక్షులు, మసాడి భీమన్న, మండల సీనియర్ నాయకులు, కొర్ర భాను ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.