జనంలోకి జనసేన – జనసేనలోకి జనం

చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, జనసేన పార్టీ లింగపాలెం మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షుడు చల్లా నాగబాబు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో లింగపాలెం మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలు చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య అందజేయడం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 4:00 గంటల నుండి తువ్వచిలకరాయుడుపాలెం గ్రామంలో “జనంలోకి జనసేన – జనసేనలోకి జనం” అనే కార్యక్రమం ప్రారంభం కానుంది. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను లింగపాలెం మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి తీసుకువెళ్లే విధంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య పాదయాత్ర చేయటం జరుగుతుందని తెలిపారు. “జనంలోకి జనసేన – జనసేనలోకి జనం” కార్యక్రమం విజయవంతం చేయాలని, జనసేన నాయకులందరూ పాదయాత్రలో పాల్గొనాలని, పార్టీ బలోపేతం కోసం నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. ఇంచార్జి మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, చింతలపూడి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని, నాయకులు కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, పటాన్ యాకుబ్ వలి, చల్లా నాగబాబు, ప్రధాన కార్యదర్శులు బంటు సామ్యెల్ రాజు, మోదుగు అంజిబాబు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, పమిడికొండ కిషోర్, కలవకొల్లు నాగరాజు, సంయుక్త కార్యదర్శి కలకోటి నాగ దుర్గా పేరాచారి, నాయకులు పోలిశెట్టి నాగరాజు, పూజారి సతీష్, పీకా ఆది, సాయిల ప్రేమ్ కుమార్, దేవిని రాంబాబు, దేవిని కృష్ణ, దేవిని వెంకటేశ్వరరావు, కోడూరి చందు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.