ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించిన అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు మధుమేహం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ -102 గవర్నర్ కర్రోతు సత్యం హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ కర్రోతు సత్యం, ఎలక్ట్ గవర్నర్ డి.శ్రీరామ్మూర్తి, భవన నిర్మాణ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలంతా ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపాలని, ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు బిపి, షుగర్ తనిఖీలు చేసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని, ముఖ్యంగా ప్రాణాంతకమైన గుట్కా, ఖైనీ, పొగాకు, మద్యం అలవాటు ఉన్నవారు మానుకొని, సరియైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. వాసవి డయాగ్నొస్టిక్ టెక్నీషియన్ అభి సేవలందించిన ఈ శిబిరంలో సుమారు అరవై మందికి పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఉద్యమ కారులు, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పప్పు విశ్వనాధం, వాకర్స్ చైర్ పర్సన్ ఓంకార మూర్తి, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు వై.నలమారాజు పాల్గొన్నారు.