75 ఏళ్ళు దాటినా కూడా సక్రమంగా గిరిజన మౌళికాభివృద్ది చెయ్యలేదు: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం మండలం, జె.కొత్తూరు గ్రామంలో గ్రామస్తులు ఆహ్వానం మేరకు హాజరైన అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు జనసేనపార్టీ గూడెం, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మండలాల నాయకులు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డా.గంగులయ్య మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న అనిశ్చిత అభివృద్ధి విషయాలపై పాలక ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల పాపం కూడా ఉందని, ఇప్పటికి 75 ఏళ్ళు దాటినా కూడా సక్రమంగా గిరిజన మౌళికాభివృద్ది చెయ్యలేదు. ఆ ఫలితం ఇప్పుడు మారుమూల పల్లె ప్రాంతాలు తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నది ఉదాహరణకు మారుమూల ప్రాంతమైన ఈ గ్రామం జె.కొత్తూరునే తీసుకుందాం ఎటువంటి రోడ్డు వ్యవస్థా లేదు, సరైన రవాణా సదుపాయం లేక నేటికి ప్రాణాలు కోల్పోయిన గిరిజనులు చాలామంది ఉన్నారు. ఇదే గ్రామంలో మీ గ్రామస్తులే చెప్పారు వారం రోజుల్లో 7 గురు గిరిజన సోదరులు మరణించిన మాట నన్ను కలిచివేసింది. రహదారికి ప్రధానంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న చలనం లేకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం బలంగా మార్పుకోరుకునే రాజకీయాలపై ఆలోచన చేయాలని తెలిపారు జనసేనపార్టీ ద్వారా మార్పు కొరకు పాటుపడే యువత ఇప్పుడు గ్రామ గ్రామ సందర్శన చేపడుతుందని మీరంతా స్వాగతం పలికి రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపే లక్ష్యంగా మీ ఓటు హక్కుతో గిరిజన ఆస్తిత్వంపై దాడి చేసిన టీడీపీ, వైసీపీ వంటి గిరిజన ద్రోహుల పార్టీని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు నచ్చి ఇన్చార్జ్ డా.గంగులయ్య చేతులమీదుగా కండువా కప్పుకుని పార్టీలో చేరారు ఈ సమావేశంలో జనసేనపార్టీ లీగల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, గూడెం మండల నాయకులు కొయ్యమ్ బాలరాజు, సిద్దార్ధ మార్క్, అరడ కొటేశ్వరరావు, కూడా మధుకుమార్, ఈశ్వర్రావు, చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, పాడేరు జనసేనపార్టీ ఐటి ఇన్చార్జ్ అశోక్, సంతోష్ తదితర జనసైనికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.