మాజీ సర్పంచ్ కు గూడు నిర్మించండి: తుమ్మల బాబు

పెద్దాపురం, పెద్దాపురం మండలం, తూర్పు పాకల గ్రామంలో జనసేన-జన బాట కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని సందర్శించి పెద్దపు నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు), ఓ మాజీ సర్పంచ్ అరకొర పనులతో పూర్తయిన సచివాలయంలో ఉండటం గ్రామ నాయకులు, జనసైనికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు విషయం ఏమిటి అని పూర్తిగా ఆవిడ దగ్గరికి వెళ్లి అడగగా తన పేరు, సురవరపు సుబ్బయ్యమ్మ1999 వసంవత్సరంలో సర్పంచ్ గా పోటీ చేసిగెలవడం జరిగిందని, గ్రామంలో ప్రధాన సమస్య అయిన రామచంద్రాపురం నుండి తూర్పు పాకల గ్రామానికి ప్రపంచ బ్యాంకు నిధులతో బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందని బి.సి రిజర్వేషన్ లో భాగంగా (విశ్వ బ్రాహ్మణ) కులానికి చెందినతాను ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అని, కుమార్తె, కుమారుడు చనిపోయారని ఒక కుమారుడు గ్రామంలో ఉపాధి సరిపడక పక్క గ్రామం రామచంద్రపురంలో ఉంటున్నాడని, ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదని, స్థలం కూడా లేదని తుమ్మల బాబుతో ఆమె చెప్పి వాపోయింది, విషయం పూర్తిగా తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) తక్షణమే ప్రభుత్వ పెద్దలు అధికారులు స్పందించి ఆమె ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సోమవారం స్పందన కార్యక్రమంలో, పెద్దాపురం ఆర్డీవోకి మరియు ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విషయమై ఆర్డీవో ఎమ్మార్వోలు సానుకూలంగా స్పందించారని, మాజీ సర్పంచ్ కి పూర్తి న్యాయం జరిగిందని ఆశిస్తున్నానని లేని పక్షంలో స్థలం చూసి జనసేన నాయకులు, జనసైనికులు చందాలతో ఆమెకుఒక రేకుల షెడ్డు నిర్మించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉలవకాయల బాబి, పసుపులేటి దుర్గ బాబు, పేరుపురెడ్డి వీరబాబు, తోట శ్రీను, లక్కాకుల వీరబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, నియోజకవర్గ సమన్వయకర్త మంచం సాయిబాబు, వీరమహిళలు పెంకే వెంకటలక్ష్మి, త్రిపరగిరి చంద్రముఖి, పెద్దాపురం పట్టణ యువత అధ్యక్షులు లక్ష్మణ్ దివాకర్, సామర్లకోట మండలం యువత అధ్యక్షుడు మలిరెడ్డి బుచ్చిరాజు, కండవల్లి సత్యనారాయణ, సమ్మింగి సాయి తదితరులు పాల్గొన్నారు.