స్పందనలో వినతిపత్రమిచ్చిన దాడి భానుకిరణ్

ఆత్మకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో సమస్యలపై పోరాటం చేసే దిశగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో దువ్వూరు గ్రామపంచాయతీ మరియు అనసూయనగర్ గ్రామం నందు మూడు ప్రధానమైన సమస్యల పట్ల సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీ చేయడం జరిగింది. ఈ వినతిలో దువ్వూరు గ్రామపంచాయతీ నందు 50 వేలు నుంచి 80 వేలు లీటర్ల సామర్థ్యం గల త్రాగునీరు నిల్వపరిచే వాటర్ ట్యాంక్ ను నిర్మించాలని, విద్యార్థులు పోవుటకు చిన్న బలిజపాలెం నుండి ప్రభుత్వ పాఠశాల వరకు సిమెంట్ రోడ్డును మరియు డ్రైనేజీలు నిర్మించాలని, కొత్త చిలుక కాలువ పూడిక తీసి, కొత్తచిలుక కాలనీ కాంక్రీట్ రూపంలో నిర్మించాలని ప్రస్తావించడం జరిగింది. మూడు ప్రధాన సమస్యల పట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు అత్తిపాటి కృష్ణమోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు.