వైసీపీ నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన సోము వీర్రాజు

బీజేపీ చీప్‌ సోము వీర్రాజు ఏపీలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై సీరియస్‌ అయ్యారు. అధికారులను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆయన స్పందించాడు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను వేదించడం చేస్తే నేనేంటో మీకు ముందు ముందు చూపిస్తానంటూ వైకాపా ఎమ్మెల్యేలను మరియు నాయకులను ఉద్దేశించి సోము వీర్రాజు వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో టీడీపీ నాయకులు కూడా బీజేపీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వైకాపా నేతలు కూడా అదే తీరు లో పయనిస్తున్నారు.

మీరు అధికారంలో ఉండేది కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటీ అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటాము అనుకోవడం తప్పు. కనుక మీరు చేస్తున్న తప్పుడు పనులను వేదింపులను మానుకోవాలి. లేదంటే ముందు ముందు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలు కు సోము వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను రాష్ట్రంలో వేదిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాం అంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.