పాలకులకు చిత్తశుద్ధి లేకనే వరికపూడిసెల మరుగునపడింది: గాదె

వినుకొండ నియోజకవర్గంలో స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా నేటికీ తాగునీటి సమస్యలు ప్రజల్ని వెంటాడుతున్నాయని ఇది ముమ్మాటికీ పాలకుల వైఫల్యమేమనని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరారవు అన్నారు. వరికపూడిసెల సాధన సమితి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫిరెన్సులో ఆయన పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన అవి శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ప్రాజెక్టు ను వాడుకుంటున్నారని అన్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుపై 2019 ఎన్నికల్లో హామీ యిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదని అమ్మఒడి, నాన్నబడి పేరుతో అనేక కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి 500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి మాత్రం నిధులు కేటాయించక పోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా కళ్ళుతెరుచుకొని ఎవరు అభివృద్ధి కారకులు, ఎవరు అభివృద్ధి అడ్డుకునే వారో ప్రజలు తెలుసుకొని ఓట్లు వెయ్యేలని కోరారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంది ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమేనని అన్నారు. వరికపూడిసెల సాధన సమితి కోసం అందరూ కలసిపోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరికపూడిసెల సాధన సమితి సభ్యులు జనసేన పార్టీ జిల్లా సభ్యులు నారదాసు రామచంద్ర ప్రసాద్, నిస్సంకరావు శ్రీనివాసరావు, బొల్లాపల్లి మండల అధ్యక్షుడు హనుమ నాయక్..ఈపురు మండల అధ్యక్షుడు పోనపాల వెంకటనర్సయ్య జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.