పిడుగురాళ్ల మండల జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

గురజాల, భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశిం సైదా, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు దూదేకుల సలీమ్, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకోలిమి కిరణ్ కుమార్, గురజాల నియోజవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగ వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి షేక్ వలి, బేతంచర్ల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు(దాసు) మాటూరి లింగయ్య, బేతంచర్ల ప్రసాద్, సాయి మొదలగువారు పాల్గొన్నారు.