దామలచెరువు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

చంద్రగిరి, భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం జనసేన పార్టీ దామలచెరువు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్, పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్, ఎస్సి సెల్ నాయకులు హరి, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్ల, జనసేన నాయకులు నాగిరెడ్డి, షాజహాన్, అస్లాం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.