నియోజకవర్గంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తాం: యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండల కేంద్రంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించిన వాళ్లు ఒక సాత్వికతను పొందుతారు, మనం కూడా విద్యావంతుల అవ్వాలనే కోరిక కలుగుతుందని తెలిపారు. అట్టడుగు నుండి ఆకాశానికి ఎదిగిన నాయకుడు, చాలా కష్టాలు పడి పైకి వచ్చాడు, తల్లిదండ్రులు ఒక అపురూపమైన శిల్పాన్ని ప్రపంచానికి అందించారని కొనియాడారు. అంబేద్కర్ నల్ల బోర్డు దగ్గరికి వెళితేనే ఉలిక్కిపడిన ఈ సమాజం ఆయన చేత రాజ్యాంగ రాయించుకోవలసి వచ్చిందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పొందారో ఆ తరువాత అన్ని గౌరవాలు పొందారని తెలిపారు. ఆయన సున్నితమైన మనసుని గాయపరిచిన వారే ఆయన్ని నెత్తిన ఊరేగాల్సి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ తన వ్యక్తిత్వాన్ని తానే నిర్మించుకున్నాడని, విద్యను ధనం కోసం కాకుండా జ్ఞానం కోసం అర్జించాడని, విద్యతో గర్వించకుండా ఆత్మగౌరవాన్ని రూపొందించు కున్నాడని తెలిపారు. మనిషిని ప్రేమించడం, ఆయన దినచర్యలో భాగమైంది అని తెలిపారు. అంబేద్కర్ కులం పునాదులు పెకలించారని, లోయల్లో నుండి పైకి ఎదిగిన ప్రతిభావంతుడిని ఉద్ఘాటించారు. మస్తకంతో రాజ్యాన్ని జయించాడని, పుస్తకం తో ప్రపంచాన్ని జయించాడని, కత్తి కంటే కలం గొప్పదని కొనియాడారు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో, తనను తరగతి గదిలో బయట కూర్చోబెట్టి పాఠాలు చెప్పిందో, అదే భారతదేశంలో తన ప్రజలను విద్యావంతులు చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడని తెలిపారు. అయన విస్తృతమైన అధ్యయన శక్తి, ఆయన పరిశోధన దృష్టి భారతదేశ గమనాన్ని మార్చి వేసిందని తెలియజేశారు. మనిషిని ప్రేమించి, మనిషి ప్రతిభను గుర్తించలేని దేశంలో, ఆయన ఎన్నో అవమానాలు అనుభవించి, ఈ అవమానాలు నా వారసులు అనుభవించకూడదని నిర్ధారించుకొని పోరాటం గావించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఎవరైతే అంబేద్కర్ను నిరాకరించారో, ఎవరైతే అంబేద్కర్ రచనలు దుయ్యబట్టారో, వారంతా ఇప్పుడు అంబేద్కర్ను అనుసరించవలసిన పరిస్థితులకు నెట్టబడ్డారని తెలిపారు. ప్రతి వ్యక్తిని గుర్తించడం, ఆ మనిషిలో ఉన్న ప్రతిభను గుర్తించడం, ఆ ప్రతిభ మానవ సమాజానికి ఎలా ఉపకరిస్తుందని గుర్తించడం, నిశితమైన దృష్టి, లోతైన పరిశీలన, విస్తృతమైన భావజాలం అంబేద్కర్ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం అని తెలిపారు. ఒక మనిషిని ఒక మనిషి ప్రేమించాలి, గౌరవించాలి, ఆత్మీయం చేసుకోవాలి అది మానవత్వం అంటే తెలిపిన మహా మనిషి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు. కులం లేని మనిషి ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడని, కులం లేని మనిషి ప్రపంచాన్ని జయిస్తాడని చెప్పిన మహా మనిషి పవన్ కళ్యాణ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవటం మాకు మార్గదర్శనం అని తెలిపారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పెనుమూరు మండల ప్రజలకు, నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలు ప్రజలకు జై జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇస్తే, నియోజకవర్గంలో భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని, అగ్రవర్ణ పేదలకు అండగా నిలబడతామని, పెనుమూరులో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, రాయల పాలన తీసుకొస్తామని, సర్వరంగ సమగ్ర అభివృద్ధి ప్రతి గ్రామములో సాధిస్తామని, ధీమా వ్యక్తం చేశారు. గెలుపు జనసేన అయినప్పుడు నువ్వు ఎలా గెలుస్తావని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి సవాల్ విసిరారు. షెడ్యూల్డ్ కులాలను, షెడ్యూల్డ్ తెగలను, వెనుకబడిన తరగతులను, క్రైస్తవ మైనారిటీ వర్గాలను, ముస్లిం మైనారిటీ వర్గాలను, అగ్రవర్ణ పేదల అభివృద్ధిని విస్మరించిన నారాయణస్వామిని ఓడించి, జనసేన జెండాను రెపరెపలాడించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతయే గాక భారతదేశపు అందరివాడిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెనుమూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, బాలాజీ, రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి గురు ప్రసాద్, మండల కార్యదర్శి శేఖర్, రాజు, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, సెల్వి, కార్వీటి నగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నరేష్ చంద్రమౌళి, హరీష్, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, కాపు యువసేన నాయకులు సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, వెంకటేష్, వెదురు కుప్పం సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సతీష్, గంగాధర నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు శివ, నియోజకవర్గం బూత్ కన్వీనర్ హరీష్ రావు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.