వైద్యఖర్చులకు జనసేన ఆర్ధికసాయం

పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట గ్రామం, కొర్లపాటి వారి పాలెం కు చెందిన పెంట హవీలా అనే 5 సవంత్సరాల చిన్న పాపకు ఊపిరితిత్తులలో నీరు పట్టడం వలన ఆపరేషన్ నిమిత్తం యూఏఈ జనసేన, పవన్ సేన ఆధ్వర్యంలో పెనుమల జాన్ బాబు నేతృత్వంలో రూపాయలు 10000/- కొమ్ముల వేణు, మండేలా నాగ, మండేలా గోపాల్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెడ్డం గాంధీ, తోట శ్రీను, యర్రంశెట్టి నాగేంద్ర, యర్రంశెట్టి జగదీష్, రవణం విజయ్, వంగ సతీష్,బండి మణికంఠ, అక్కిశెట్టి వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.