పొట్లి గ్రామ దేవత ఉత్సవాలకు గర్భానకు ప్రత్యేక ఆహ్వానం

పాలకొండ, జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గం కేంద్ర కార్యాలయానికి, పొట్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు విచ్చేసి, గర్భాన సత్తిబాబుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పోట్లి గ్రామ పెద్దలు శ్రీశ్రీశ్రీ బంగారుతల్లి గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలకు హాజరుకావాలని, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబుకి ప్రత్యేక ఆహ్వానం అందించారు. తప్పకుండా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొంటామని గర్భాన సత్తిబాబు అన్నారు.