జనంకోసం జనసేన ఆమదాలవలస మునిసిపాలిటీలో 5వ వార్డు

ఆమదాలవలస నియోజకవర్గం 5వ వార్డు పంతుల పేట గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలుతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించి గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటుగా సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, టౌన్ నాయకులు గంగు కొటేష్, గోద్దు కోటేష్, బగ్గు సురేష్, షణ్ముఖరావు, దువ్వాడ కరుణ సాగర్, రాజు, రమణమూర్తి, మోహన్ రావు, గుండా రమణ, రాజశేఖర్, రాజా, రాము, పవన్, రామారావు, గణేష్, భాను, రాజు తదితరులు పాల్గొన్నారు.